మహిళలకు భద్రత కల్పించాలి : ఐద్వా
ABN , First Publish Date - 2022-12-07T23:53:13+05:30 IST
మహిళలకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ భద్ర త కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్వా జిల్లా ఉపాఽధ్యక్షురాలు తుమ్మల పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండ రూరల్/ చిట్యా ల, డిసెంబరు 7: మహిళలకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ భద్ర త కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్వా జిల్లా ఉపాఽధ్యక్షురాలు తుమ్మల పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహిళలపై హింస, మానవ హక్కులు, రక్షణ చర్యలు, ప్రభుత్వాల పాత్ర’ అనే అంశంపై సంఘం ఆధ్వర్యం లో జిల్లాకేంద్రంలోని మహిళా జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సెమినార్లో మాట్లాడారు. దేశంలో ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మహిళలను భద్రత కరువైందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంతో మహిళల హక్కులు, రక్షణ చట్టాల గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, ఎస్పీ హాస్టల్ వార్డెన్ సత్యవతి ఉన్నారు. చిట్యాలలోని సాయిభారతి కళాశాలలో బుధవారం నిర్వహించిన మహిళా సెమినార్లో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడారు. మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నా ఇంకా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా లభించడం వల్ల మహిళలపై దౌర్జన్యాలు పెరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, నాయకులు కందుల అనిత, లోడె ప్రసన్నలక్ష్మి, పుల్లెంల సంతు, ప్రియాంక పాల్గొన్నారు.