రైతుబంధు సాయం రూ.303.8 కోట్లు

ABN , First Publish Date - 2022-12-24T23:59:04+05:30 IST

యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సాయం ఈ నెల 28వ తేదీ నుంచి రైతులకు అందనుంది. నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ రైతుల జాబితాను సిద్ధం చేసింది. జిల్లాలో 2.61లక్షల మంది రైతులు ఉండగా, వారికి రూ.303.8కోట్లు ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించనుంది.

రైతుబంధు  సాయం రూ.303.8 కోట్లు

ఈ నెల 28నుంచి పంపిణీకి అధికారుల కసరత్తు

సంక్రాంతిలోగా రైతుల ఖాతాల్లో జమ

జిల్లాలో 2.61లక్షల మందికి లబ్ధి

యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సాయం ఈ నెల 28వ తేదీ నుంచి రైతులకు అందనుంది. నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ రైతుల జాబితాను సిద్ధం చేసింది. జిల్లాలో 2.61లక్షల మంది రైతులు ఉండగా, వారికి రూ.303.8కోట్లు ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించనుంది.

- (ఆంధ్రజ్యోతి,యాదాద్రి)

జిల్లాలో మొత్తం 17 మండలాల్లో రైతులు వివిధ పం టలు సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4.50లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ప్రభుత్వం పంట పెట్టుబడి కిం ద రైతులకు సాయం అందించేందుకు రైతు బంధు పథకా న్ని అమలు చేస్తోంది. ఏటా వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. యాసంగి సీజన్‌ ప్రారంభానికి ముందే పంట పెట్టుబడిని రైతుల ఖాతాల్లో జమ చేయాలి. అయితే సీజన్‌ ప్రారంభమైనా రైతులకు రైతుబంధు అందలేదు. మరింత ఆలస్యం చేయకుండా సం క్రాంత్రిలోగా రైతులకు రైతుబంధు సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి రైతులకు ఆర్థికసాయం అందించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. రైతుబంధు పథకంతో రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు కలిపి ఎకరాకు రూ.10వేల చొప్పున రాష్ట్ర ప్రభు త్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఎంతమేరకు ఆర్థికసాయం అందించాలన్న అంశంపై రైతులవారీగా ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. 2022 యాసంగిలో జిల్లాలోని 2,61,052 మంది రైతులకు రూ.303.80కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేసింది. నిత్యం రైతులకు పట్టాదారు పాసుపుస్తకా లు జారీ అవుతుంటాయి. అయితే ఎప్పటివరకు జారీ చేసి న వారికి సాయం అందించాలన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే జమ చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఎప్పటిలాగానే మొదటగా ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి ప్రారంభించి, సంక్రాంతిలోగా రైతులందరీ బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

పీవోబీ భూములకు మోక్షంతో పెరిగిన రైతులు

ధరణి వెబ్‌సైట్‌లో నిషేధిత జాబితా(పీవోబీ)లో ఉన్న భూములకు ప్రభుత్వం మోక్షం కలిగిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈవెబ్‌సైట్‌ ప్రారంభంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లోని భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు పీవోబీ ఖాతాల్లోకి చేరాయి. ఒక సర్వేనెంబర్‌లో ఏదైనా వివాదం తెలిత్తితే... అదే సర్వేనెంబర్‌(బై)లోని మిగతా భూములన్నీ కూడా పీవోబీలో చేర్చారు. దీంతో భూములపై రైతులకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ, పీవోబీలో చేరడంతో భూముల క్రయ, విక్రయాలు, భూమార్పిడి, రైతుబంధుతోపాటు పలు సంక్షేమ పథకాలు వంటివి నిలిచిపోయాయి. ఇటీవల ప్రభుత్వం ధరణిలో పీవోబీలో ఉన్న భూములన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం పీవోబీలో ఉన్న భూముల వివరాలపై కసరత్తు చేసింది. కోర్టు కేసుల్లో ఉన్న భూములను మినహాయించి, మిగతా వాటిని వారంరోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. జిల్లాలో మొత్తం 284 రెవన్యూ గ్రామాలున్నాయి. వీటిలో ఇప్పటివరకు 264 రెవెన్యూ గ్రామాల్లోని పీవోబీ భూముల సమస్యను రెవెన్యూ అధికారులు స్థానికంగా పరిష్కరించారు. మరో 20 రెవెన్యూ గ్రామాల్లో దాదాపు 21వేల ఖాతాల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో వారంరోజుల్లోగా 18వేల వరకు సమస్యలను పరిష్కరించారు. మరో 3వేల ఖాతాలకు సంబంధించిన భూములపై విచారణ జరుపుతున్నారు. చాలా వరకు పట్టాదారు పాసుపుస్తకాల్లో భూమి తక్కువగా రావడం, సర్వేనెంబర్లు, పట్టాదారుల యజమానుల పేర్లు పొరపాటుగా ముద్రించడం వంటిని ఉన్నాయి. ఒక రైతుకు రికార్డుపరంగా ఐదు ఎకరాలు భూమి ఉంటే... వారి పట్టాదారు పాసుపుస్తకాల్లో నాలుగు ఎకరాలే నమోదైంది. దీంతో మరో ఎకరం భూమిని తన పేరు మీద చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు రైతులకు సంబంధించిన భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, రైతుల పేరుతో భూమి రికార్డుతోపాటు పొజిషన్‌లో ఉండటంతో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో రైతుబంధు సాయం ఇలా

రైతుబంధు పథకం కింద లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతోంది. ప్రభుత్వం మొదటిసారిగా ఈ పథకాన్ని 2018 వానాకాలంలో ప్రారంభించింది. అప్పటినుంచి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తూనే ఉంది. 2018 వానాకాలంలో మొత్తం 1,78,090 మంది రైతులకు రూ.204.83కోట్లు, అదేవిధంగా యాసంగి 2018 లో 1,63289 మంది రైతులకు రూ.198.87కోట్లు, 2019 వా నాకాలంలో 1,72462 మంది రైతులకు రూ.216.93కోట్లు, 2019యాసంగిలో 1,39191మంది రైతులకు రూ.153.85 కోట్లు, 2020 వానాకాలంలో 2,03516 మంది రైతులకు రూ.285.45కోట్టు, 2020యాసంగిలో 2,09662మంది రైతులకు రూ.289.17కోట్లు, 2021వానాకాలంలో 2,14671మంది రైతులకు రూ.287.88కోట్లు, 2021 యాసంగిలో 2,2112 మంది రైతులకు రూ.291.97కోట్లు, 2022వానాకాలంలో మొత్తం 2,33461మంది రైతులకు రూ.293.10కోట్లు, తా జాగా 2022యాసంగిలో జిల్లాలోని 2,61,052మంది రైతులకు రూ.303.80కోట్లను పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అంచనా వేసింది. గత సీజన్‌తో పోలిస్తే రైతులు పెరిగే అవకాశం ఉంది.

Updated Date - 2022-12-24T23:59:06+05:30 IST