శివాలయం నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం

ABN , First Publish Date - 2022-05-30T06:32:24+05:30 IST

అడ్డగూడూరు మండలం డి.రేపాక గ్రామంలో నిర్మి స్తున్న శివాలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన వైస్‌ ఎంపీపీ దైద పురు షోత్తంరెడ్డి, గ్రామ సర్పంచ్‌ ముక్కాముల సుమలత రూ.5లక్షల చొప్పున విరాళం అందజేశారు.

శివాలయం నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం
దాతలను సన్మానిస్తున్న గ్రామస్థులు

మోత్కూరు, మే 29: అడ్డగూడూరు మండలం డి.రేపాక గ్రామంలో నిర్మి స్తున్న శివాలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన వైస్‌ ఎంపీపీ దైద పురు షోత్తంరెడ్డి, గ్రామ సర్పంచ్‌ ముక్కాముల సుమలత రూ.5లక్షల చొప్పున  విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాలయం నిర్మా ణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం దాతలను గ్రామస్థులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో లింగాల సుధాకర్‌రెడ్డి, కంచర్ల చలపతిరెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ చిప్పలపల్లి మహేందర్‌నాథ్‌, ఆర్‌ఐ యాదగిరి, ఉప సర్పంచ్‌ కన్న వీరన్న, ఎస్‌ఎంఈ చైర్మన్‌  చిప్పలపల్లి పరశురా ములు, బొనుగ వెంకట్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బండారి వీరస్వామి, ముక్కాముల నర్సయ్య, శివకుమార్‌, సోమన్న, శ్రీకాంత్‌, శేఖర్‌, సైదులు, రాజు పాల్గొన్నారు.


Read more