ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2022-09-11T05:34:05+05:30 IST

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధితులకు అండగా ఉంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భూములు, ఇండ్ల స్థలాల కోల్పోతున్న రాయిగిరికి చెందిన బాధితులు ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్చేవిధంగా చూడాలని కోరుతూ శనివారం ఎంపీ వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరిని కలిసి చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా కృషి చేస్తామన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులకు అండగా ఉంటా
కోమటిరెడ్డితో మాట్లాడుతున్న నిర్వాసితులు

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 10: రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధితులకు అండగా ఉంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భూములు, ఇండ్ల స్థలాల కోల్పోతున్న రాయిగిరికి చెందిన బాధితులు ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్చేవిధంగా చూడాలని కోరుతూ శనివారం ఎంపీ వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరిని కలిసి చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, కౌన్సిలర్లు ఈరపాక నర్సింహ, పడిగెల రేణుక ప్రదీప్‌, కైరంకొండ వెంకటేశ్‌, గోద రాములు గౌడ్‌, బాధితులు పల్లెర్ల యాదగిరి, పసుపునూరి నాగభూషణం, యాదిరెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లేశ్‌, పాండు తదితరులున్నారు. 

Read more