road accident: డివైడర్ను ఢీకొట్టి పల్టీకొట్టిన కారు..ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-12-16T07:19:58+05:30 IST
హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై(Hyderabad-Vijayawada National Highway 65)
Nalgonda: హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై(Hyderabad-Vijayawada National Highway 65) నకిరేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఇనుపాముల బైపాస్ జంక్షన్ వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హైదరాబాదు నుండి సూర్యాపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా సూర్యాపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తివివరాలు తెలియాల్సివుంది.