కేంద్ర ప్రభుత్వ విధానాలతో పెరుగుతున్న ధరలు
ABN , First Publish Date - 2022-10-07T05:44:23+05:30 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ధరలు పెరుగుతున్నాయని సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు పాలకూరి బాబు అన్నారు.
హుజూర్‌నగర్ రూరల్, అక్టోబరు 6 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ధరలు పెరుగుతున్నాయని సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు పాలకూరి బాబు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ధరలు పెరగడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ప్రభావం పడుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సైదిరెడ్డి, రమేష్, వెంకటేశ్వర్లు, గురవయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.