‘చెర్వుగట్టు’లో టెండర్‌లకు స్పందన కరువు

ABN , First Publish Date - 2022-08-04T06:00:10+05:30 IST

ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన వివిధ టెండర్లకు వేలందారుల నుంచి స్పందన కరువైంది. మెట్లమార్గం రాజగోపురం వద్ద నూతనంగా నిర్మించిన విఘ్నేశ్వర్‌ సదన్‌ సముదాయంలోని కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో గల 10షాపులకు, పూలు విక్రయించుకొను హక్కుకు వేలందారుల నుంచి స్పంద న రాలేదు.

‘చెర్వుగట్టు’లో టెండర్‌లకు స్పందన కరువు
చెర్వుగట్టుపై బహిరంగ వేలం నిర్వహిస్తున్న దేవస్థానం సిబ్బంది

నార్కట్‌పల్లి, ఆగస్టు 3: ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన వివిధ టెండర్లకు వేలందారుల నుంచి స్పందన కరువైంది. మెట్లమార్గం రాజగోపురం వద్ద నూతనంగా నిర్మించిన విఘ్నేశ్వర్‌ సదన్‌ సముదాయంలోని కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో గల 10షాపులకు, పూలు విక్రయించుకొను హక్కుకు వేలందారుల నుంచి స్పంద న రాలేదు. పార్వతీ అమ్మవారి ఆలయ సమీపంలోని షాపులవేలంకు వచ్చే అద్దెమొత్తంలో కనీసం 25వ వంతు కూడా వేలందారుల నుంచి స్పందన కనపడలేదు. 10షాపులకు కలిపి సంవత్సరానికి మొత్తం రూ.1.56లక్షలు మాత్రమే పాటపాడారు. ఇది పాత షాపుల అద్దెల తో పోలిస్తే ఒక షాపుకు వచ్చే వేలం మొత్తంగా పరిగణించవ చ్చు. ఎత్తైన మెట్లు ఎక్కి భక్తులు వస్తువులు కొనుగోలు చేయలేర న్న సాంకేతిక కారణంతోనే ఎక్కువ మొత్తానికి వేలంపాడేందుకు వేలందారులు ఆసక్తి చూపన్నట్లు తెలుస్తోంది. కాగా గొర్రె పొట్టెళ్లు, మేక పోతుల సేకరణకు సంబంధించి గతేడాది టెండర్‌ రూ.15.10 లక్షలు పలుకగా ఈ ఏడాదికిగాను బుధవారం నిర్వహించిన ఇదే అంశానికి సంబంధించిన వేలం కేవలం రూ.9.60లక్షలు మాత్రమే పలికింది. దీంతో కమిషనర్‌ ఆమోదం కోసం బహిరంగవేలం వివరాలను పంపినట్లు ఈవో నవీన్‌కుమార్‌ తెలిపారు.    

Updated Date - 2022-08-04T06:00:10+05:30 IST