విద్యుత్ బిల్లుల కోసం స్టార్టర్ల తొలగింపు
ABN , First Publish Date - 2022-12-15T01:35:37+05:30 IST
రైతులు వ్యవసాయ మోటార్ల బిల్లులు చెల్లించడంలేదని విద్యుత్ సిబ్బంది రైతుల మోటార్ల స్టార్టర్లు కట్ చేసి తీసుకు వెళుతున్నారు.
నూతన్‌కల్, డిసెంబరు 14: రైతులు వ్యవసాయ మోటార్ల బిల్లులు చెల్లించడంలేదని విద్యుత్ సిబ్బంది రైతుల మోటార్ల స్టార్టర్లు కట్ చేసి తీసుకు వెళుతున్నారు. రైతులు బుధవారం మండల కేంద్రం శివారులోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేసరికి అప్పటికే విద్యుత్ సిబ్బంది కొన్ని స్టార్టర్లను కట్ చేసి తీసుకువెళ్లారు. యాసంగికి నార్లు పోశామని, ఈ సమయంలో స్టార్టర్లు కట్ చేసి తీసుకువెళితే నారు మడి ఎండిపోతుందని విద్యుత్ సిబ్బందికి విన్న వించినా వినలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.