సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌గా రామాంజులరెడ్డి

ABN , First Publish Date - 2022-12-29T00:11:51+05:30 IST

సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌గా రామాంజులరెడ్డి నియమితులయ్యారు.

సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌గా రామాంజులరెడ్డి

సూర్యాపేటటౌన, డిసెంబరు 28: సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌గా రామాంజులరెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న బైరెడ్డి సత్యనారాయణరెడ్డిని పెద్దఅంబర్‌పేటకు బదిలీ చేశారు. రామాంజులరెడ్డి 2019 సంవత్సరం మార్చి 1నుంచి 2022 మే 20 వరకు సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌గా వ్యవహరించారు. పెద్దఅంబర్‌పేటకు బదిలీపై వెళ్లిన ఆయన ఏడు నెలల 10 రోజుల అనంతరం మళ్లీ ఇక్కడికి రానున్నారు. ప్రస్తుత కమిషనర్‌ బైరెడ్డి సత్యనారాయణరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు, అభివృద్ధి పనుల్లో జాప్యం, పరిపాలనాపరంగా వైఫల్యం తదితర కారణాలతో బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. బైరెడ్డి సత్యనారాయణరెడ్డి గతంలో నిర్మల్‌ మున్సిపాలిటీ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఏడు నెలల 10 రోజుల అనంతరం పెద్దఅంబర్‌పేట మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్నారు.

Updated Date - 2022-12-29T00:11:54+05:30 IST