ఆర్డీవోలకు పదోన్నతి

ABN , First Publish Date - 2022-09-24T06:05:21+05:30 IST

జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్‌ రెవె న్యూడివిజన్‌ అధికారి(ఆర్డీవో)లకు పదోన్నతి లభించింది.శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ఆర్డీవోలకు పదోన్నతి

స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా నియామకం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 

యాదాద్రి, సెప్టెంబర్‌23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్‌ రెవె న్యూడివిజన్‌ అధికారి(ఆర్డీవో)లకు పదోన్నతి లభించింది.శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, చౌటుప్పల్‌ ఆర్డీవో ఎస్‌.సూరజ్‌కుమార్‌లకు డిప్యూటీ కలెక్టర్‌(డీసీ)నుంచి స్పెషల్‌ డిపూటీ కలెక్టర్‌(ఎ్‌సజీడీసీ)గాఈ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం పదోన్నతి కల్పించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న స్థానంలో విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రా ష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిలో 31మందికి  ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇందులోభాగంగా జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఆర్డీవోలకు పదోన్నతి దక్కింది. వీరిద్దరూ ఉమ్మడి జిల్లాలోని భువనగిరి డివిజన్‌లో తహసీల్దార్లుగా కూడా పనిచేశారు.

Read more