విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి : ఎస్‌ఎ్‌ఫఐ

ABN , First Publish Date - 2022-07-05T06:41:16+05:30 IST

ప్రభుత్వ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎ్‌ఫఐ జి ల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారం నరేష్‌, కమ్మంపాటి శంకర్‌ డిమాండ్‌ చేశారు.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి : ఎస్‌ఎ్‌ఫఐ
కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు

నల్లగొండటౌన, జూలై 4: ప్రభుత్వ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎ్‌ఫఐ జి ల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారం నరేష్‌, కమ్మంపాటి శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ ఆ ధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. మన ఊరు మనబడి ప్రణాళికలో భాగంగా ప్రభు త్వ పాఠశాలన్నింటినీ అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫాంలు అందించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహాయ కార్యదర్శి కొర్ర సైదానాయక్‌, బుడి గె వెంకటేశ, కోరె రమేష్‌, రేణుక, జగననాయక్‌, రావణ్‌, వీరన్న, సంపత, నవ్య, రోజా, అశోక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-05T06:41:16+05:30 IST