‘పల్లె ప్రగతి’లో గ్రామాల్లో సమస్యలు గుర్తించాలి

ABN , First Publish Date - 2022-06-07T06:30:02+05:30 IST

‘పల్లె ప్రగతి’లో గ్రామాల్లో సమస్యలను అధికారులు గుర్తించి పరిష్కరించాలని జడ్పీ సీఈవో సురేష్‌ ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఐదో విడత ‘పల్లె ప్రగతి’, నాలుగో విడత ‘పట్టణ ప్రగతి’, కార్యక్రమాలను నిర్వహించారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా మోతె మండలం నామవరం, రాఘవాపురం, మోతె గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్యం పనులు, నర్సరీలను ఆయన పరిశీలించి మాట్లాడారు.

‘పల్లె ప్రగతి’లో గ్రామాల్లో సమస్యలు గుర్తించాలి
మోతె మండలం రాఘవాపురంలో వన నర్సరీని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో సురేష్‌

జడ్పీ సీఈవో సురేష్‌

అంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూన్‌ 6:  ‘పల్లె ప్రగతి’లో గ్రామాల్లో సమస్యలను అధికారులు గుర్తించి పరిష్కరించాలని జడ్పీ సీఈవో సురేష్‌ ఆదేశించారు.  సోమవారం జిల్లా వ్యాప్తంగా ఐదో విడత ‘పల్లె ప్రగతి’, నాలుగో విడత ‘పట్టణ ప్రగతి’, కార్యక్రమాలను నిర్వహించారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా మోతె మండలం నామవరం, రాఘవాపురం, మోతె గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్యం పనులు, నర్సరీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. అధికారులు సమయపాలన పాటించాలన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకం నిర్వాహకులు మొక్కలు చనిపోకుండా చూడాలన్నారు. ప్రధాన సమస్యలైన విద్యుత్‌ స్తంభాల తొలగింపు, మరమ్మతులు చేపట్టాలన్నారు. శిథిలమైన బావులను గుర్తించి పూడ్పించాలన్నారు. నామ వరంలో శ్మశానవాటికలో కట్డడాలను పూర్తి చేయాలన్నారు. ప్రత్యేకా ధికారులు ఈనెల 15వ తేదీ వరకు గ్రామాల్లోనే ఉండాలన్నారు. నామవరం గ్రామ సభలో  కూలి డబ్బు రావడంలేదని ‘ఉపాధి’ కూలీలు, సరైన పద్ధ తిలో గ్రామంలో ‘ఉపాధి’ పనులు చేపట్టడంలేదని గ్రామ సభలో అధికా రులను నిలదీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్‌రెడ్డి, తహసీల్దార్‌ యాదగిరి, ఎంపీవో హరిసింగ్‌నాయక్‌, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

 గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి శ్రీధర్‌ అన్నారు. మద్దిరాల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన  పాల్గొని  మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ డీవో సరోజ, సర్పంచ్‌ ఇంతియాజ్‌ఖాతిన్‌  బేగం, ఎంపీవో రాజేష్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలి: మునిసిపల్‌ కమిషనర్‌

 పట్టణ వాసులు పరిసరాలను  పరిశుభ్రంగా  ఉంచాలని కోదాడ ముని సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం తొమ్మిదో వార్డులో మునిసిపల్‌ సిబ్బంది డ్రైనేజీలు శుభ్రం చేసి కంప చెట్లను తొలగించారు. ఈసందర్భంగా  ఆయన  మాట్లా డుతూ ‘పట్టణ ప్రగతి’లో ప్రజలందరూ భాగస్వాములై మునిసిపల్‌ సిబ్బందికి, అధికారులకు సహకరించాలని సూచించారు. అనంతరం వార్డు కౌన్సిలర్‌ ఆధ్వర్యంలో ‘బడిబాట’ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ మదార్‌ పాల్గొన్నారు. 




Updated Date - 2022-06-07T06:30:02+05:30 IST