విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-02T06:51:58+05:30 IST

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌ రాములు డిమాండ్‌ చేశారు.

విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూలై 1: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌ రాములు డిమాండ్‌ చేశారు. శుక్రవారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని కోరారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు.కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సిరికొండ అనిల్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి సోమయ్య,  జి.వెంకటయ్య, జె.యాకయ్య, వీరారెడ్డి, వెంకన్న, సాంబయ్య, దామోదర్‌, రవీందర్‌ పాల్గొన్నారు

Updated Date - 2022-07-02T06:51:58+05:30 IST