సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-06-07T06:43:08+05:30 IST

ప్రజావాణి దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు శ్రీనివా్‌సరెడ్డి, దీపక్‌ తివారి అన్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న ఓబీసీ నేత రాహుల్‌గౌడ్‌

అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌ తివారి

భువనగిరి రూరల్‌, జూన్‌ 6 : ప్రజావాణి దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు శ్రీనివా్‌సరెడ్డి, దీపక్‌ తివారి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నుం చి వచ్చిన ప్రజల నుంచి 53 ఫిర్యాదులు తీసుకున్నారు. రెవెన్యూశాఖకు సంబంధించినవి నాలుగు, భువనగిరి తహసీల్దార్‌ కార్యాలయానికి సంబంధించినవి 39, భువనగిరి,చౌటుప్పల్‌ మునిసిపాలిటీకి సంబంధించినవి ఒక్కో ఫిర్యాదుతో పాటు జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖకు సం బంధించి నాలుగు, మత్స్యశాఖ, సర్వేల్యాండ్‌, స్పెషల్‌ డిప్యూట కలెక్టర్‌, డీసీపీలకు సంబఽంధించి ఒక్కో ఫిర్యాదు వచ్చినట్లు కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరచారి తెలిపారు.

Updated Date - 2022-06-07T06:43:08+05:30 IST