పూర్వకంగా కలిసిన సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-06-07T07:06:22+05:30 IST

జిల్లా పరిషత్‌ నూతన సీఈవోగా ఎన్‌.ప్రేమ్‌కరణ్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా క

పూర్వకంగా కలిసిన సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి
జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డిని మర్యాద

జడ్పీ సీఈవోగా  ప్రేమ్‌కరణ్‌రెడ్డి 

నల్లగొండ / నార్కట్‌పల్లి, జూన్‌ 6 : జిల్లా పరిషత్‌ నూతన సీఈవోగా ఎన్‌.ప్రేమ్‌కరణ్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట డిప్యూటీ సీఈవో జి.కాంతమ్మ, తెలంగాణ పంచాయతీరాజ్‌ మినిస్ట్రీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంబాబు, పర్యవేక్షకుడు నాగరాజు ఉన్నారు. ఇదిలా ఉండగా సీఈవోగా డిప్యూటేషన్‌పై మూడేళ్లుగా పనిచేస్తున్న వీరబ్రహ్మచారి పదవీకాలం పూర్తికావడంతో మాతృ శాఖ రెవెన్యూ డిపార్టుమెంట్‌కు బదిలీఅయ్యారు. నార్కట్‌పల్లి మండలంలోని శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి సందర్శించారు. ఆయన వెంట సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ, తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీడీవో యాదగిరి ఉన్నారు.

Read more