కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రార్థించండి

ABN , First Publish Date - 2022-02-16T05:56:09+05:30 IST

తన ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ దేశ ప్రధాని కావాలని కాంక్షిస్తూ ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేయాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి కోరారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించిన కేసీఆర్‌ జన్మదిన వేడుక, అన్నదాన కార్యక్రమానికి ఇరువురు సంయుక్తంగా హాజరై మాట్లాడారు.

కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రార్థించండి
ఆలేరులో అన్నదానం చేస్తున్న గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు

 ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌: తన ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ దేశ ప్రధాని కావాలని కాంక్షిస్తూ ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేయాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి కోరారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించిన కేసీఆర్‌ జన్మదిన వేడుక, అన్నదాన కార్యక్రమానికి ఇరువురు సంయుక్తంగా హాజరై మాట్లాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మునిసిపల్‌, మార్కెట్‌ కమిటీ, సింగిల్‌ విండో చైర్మన్లు వస్పరి శంకరయ్య, గడ్డమీది రవీందర్‌ గౌడ్‌, మొగులగానిమల్లేశం, వైస్‌ చైర్మన్లు ఎం మాధవి వెంకటేశ, గ్యాదపాక నాగరాజు, చింతకింది చంద్రకళ, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌, పుట్ట మల్లేశం, నాయకులు బేతి రాములు, శ్రీకాంత పాల్గొన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీప్‌  భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ, మునిసిపల్‌, మార్కెట్‌ చైర్మన్లు జడల అమరేందర్‌, ఎనబోయిన ఆంజనేయులు, నల్లమాస రమేశ, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ ఎస్‌ బీరుమల్లయ్య, ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా కన్వీనర్‌ కొలుపుల అమరేందర్‌, వైస్‌ చైర్మన చింతల కిష్టయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఏవీ కిరణ్‌, జనగాం పాండు, కౌన్సిలర్లు, సర్పంచలు, ఎంపీటీసీలు ఉన్నారు. మండలంలోని తాజ్‌పూర్‌ పాఠశాల, అంగన వాడీ కేంద్రం లో గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్‌, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ బొమ్మారపు సురేశ, ఉప సర్పంచ ర్యాకల సంతోషి శ్రీనివాస్‌, నాయకులు ఓరుగంటి రమేశ, కొండల్‌, సందీప్‌ ఉన్నారు. బీబీనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ ప్రణితా పింగల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన శ్రీనివా్‌సరెడ్డి, బొక్క జైపాల్‌రెడ్డి, రాచమల్ల శ్రీనివా్‌సరెడ్డి, భాగ్యలక్ష్మీశ్రీనివాస్‌, దస్తగిరి, అక్బర్‌ పాల్గొన్నారు.


Read more