ప్రజాకవి కాళోజీ రచనలు ఉద్యమాలకు స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-09-10T06:18:50+05:30 IST

ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రజాకవి కాళోజీ రచనలు ఉద్యమాలకు స్ఫూర్తి
నల్లగొండలో కాళోజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జడ్పీ ఉద్యోగులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ రచనలు ఉద్యమాలకు స్ఫూర్తి అని కొనియాడారు. పీఏపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఆంజనే యులు కాళోజి చిత్రపటానికి నివాళులర్పించారు. మిర్యాలగూడలోని గ్రంథాల యంలో బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నాల వెంకయ్య, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దశరధనాయక్‌, బీసీ సంఘం డివిజన్‌ అధ్యక్షుడు గుడిపాటి కోటయ్య, లైబ్రేరియన్‌ శ్రణ్‌కుమార్‌, సుధాకర్‌, ఎంపీడీవో కార్యాలయం, విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయాల్లో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసి ంహారెడ్డి, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, మారం శ్రీనివాస్‌, తాళ్లపల్లి రవి పాల్గొన్నారు. కనగల్‌ ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీపీ కరీంపాష, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో సోమసుందర్‌రెడ్డి, డీటీ తబిత పాల్గొన్నారు. మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ చిట్టిబాబునాయక్‌, ఎంపీడీవో జ్యోతి లక్ష్మీ,ఎంపీవో వీరారెడ్డి, ఏఈవో ఆదినారాయణ, ఏపీవో శిరీష పాల్గొన్నారు. వేము లపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత, ఎంపీటీసీ పల్లా వీర య్య, ఎంపీవో సంగీత, ఏపీవో మిరాజుద్దిన్‌ పాల్గొన్నారు. మాడ్గులపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీవిద్య, జడ్పీటీసీ పుల్లెంల సైదులు, ఎంపీడీవో దండ జితేందర్‌రెడ్డి, పోకల రాజు, ఎంపీవో రవికుమార్‌, ఏపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఈసీ బాలునాయక్‌ పాల్గొన్నారు. చండూరులో కాళోజీ చిత్రపటానికి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రాం నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొన్‌రెడ్డి యా దయ్య, గుంటి వెంకటేషం, మేనేజర్‌ ప్రభాకర్‌, ఆర్‌ఐ అరుణకుమారి పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేగట్టే మల్లి కార్జున్‌రెడ్డి కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బి. బాలమ్మ, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, బుచ్చిరెడ్డి, అలెగ్జాండర్‌ పాల్గొన్నారు. శాలిగౌరారంలో ఎంపీడీవో రేకల లక్ష్మయ్య, ఎంపీపీ సలహాదారు గంట శంకర్‌, సూపరింటెండెంట్‌ రాయుడు, ఈసీ వెంకటా చారి పాల్గొన్నారు. తిరుమలగిరి(సాగర్‌)లో ఎంపీడీవో ఖాజా అజ్ఘర్‌అలీ కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సబితారెడ్డి, సైదానాయక్‌, నరేందర్‌, శ్రీరాములు, వరలక్ష్మీ, గోపి, నరేందర్‌, కర్నాకర్‌, గోపి పాల్గొన్నారు. నార్కట్‌పల్లిలో ఎంపీపీ సూదిరెడ్డి నరేంద ర్‌రెడ్డి, సర్పంచ్‌ దూదిమెట్ల స్రవంతి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, పాశం శ్రీనివాస్‌రెడ్డి, దుబ్బాక శ్రీధర్‌, ఎంపీడీవో యాదగిరి పాల్గొన్నారు. హాలియాలో ము నిసిపల్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మశంకరయ్య, చెరుపల్లి ముత్యాలు, కమిష నర్‌ కందిమళ్ల వీరారెడ్డి, కౌన్సిలర్లు చింతల చంద్రారెడ్డి, యడవల్లి నరేందర్‌రెడ్డి, అన్నెపాక శ్రీనివాస్‌, తక్కెళ్లపల్లి సైదులు, నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్‌నాయక్‌ పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మంగా సీనియర్‌ అసి స్టెంట్‌ నాగమణి, చింతల చంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, జోసఫ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-10T06:18:50+05:30 IST