దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌

ABN , First Publish Date - 2022-10-26T00:37:19+05:30 IST

మునుగోడు ఉపఎన్నికలో భాగంగా ఎన్నికల సంఘం దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసుకునే అవకాశం కల్పించినట్లు మర్రిగూడ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివా్‌సరెడ్డి తెలిపా రు.

దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌

లేవలేని స్థితిలో ఉన్నవారికి అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం

మర్రిగూడ, అక్టోబరు 25: మునుగోడు ఉపఎన్నికలో భాగంగా ఎన్నికల సంఘం దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసుకునే అవకాశం కల్పించినట్లు మర్రిగూడ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివా్‌సరెడ్డి తెలిపా రు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంచానికి పరిమితమై, లేవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, వృద్ధులు ఇందుకు అర్హులన్నారు. మర్రిగూడ మండలంలో 174మంది దివ్యాంగులు, వృద్ధులు ఉన్నట్లు తెలిపారు. అందులో 43 మంది 80ఏళ్లు పైబడిన వారు, 131 మంది దివ్యాంగులను గుర్తించినట్లు వివరించారు. పోలింగ్‌ బూత్‌లకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నందున ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని బాధితులు జిల్లా ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వారి అభ్యర్థనకు స్పందించి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం ఆదేశించిందని వివరించారు. మండలంలో మూడు రోజులుగా అధికారులు ఇంటింటికీ తిరుగుతూ బాధితుల నుంచి బాల్యెట్‌ ద్వారా ఓటు హ క్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. మర్రిగూడ మండలంలో 18గ్రామపంచాయతీలకు 33 పోలింగ్‌ బూత్‌లు ఉండగా,22,309 మంది ఓటర్లున్నారని తెలిపారు. ఉపఎన్నికలో భాగంగా 33 పోలింగ్‌ బూత్‌లను పరిశీలించి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2022-10-26T00:37:22+05:30 IST