ధర్నాను భగ్నం చేయడానికి పోలీసుల యత్నం

ABN , First Publish Date - 2022-06-07T06:57:26+05:30 IST

డిండి నిర్వాసితులకు పరిహారం అందించా లని చర్లగూడెం రిజర్వాయర్‌ క్యాం పు కార్యాలయం వద్ద భూ నిర్వాసితులు చేపడుతున్న ధర్నాను పోలీసులు భగ్నం చేయడానికి యత్నించారు.

ధర్నాను భగ్నం చేయడానికి పోలీసుల యత్నం
ధర్నా వద్ద మోహరించిన పోలీసులు

మర్రిగూడ, జూన 6: డిండి నిర్వాసితులకు పరిహారం అందించా లని చర్లగూడెం రిజర్వాయర్‌ క్యాం పు కార్యాలయం వద్ద భూ నిర్వాసితులు చేపడుతున్న ధర్నాను పోలీసులు భగ్నం చేయడానికి యత్నించారు. చర్లగూడెం నిర్వాసితులు చేపడుతున్న ధర్నా సోమవారానికి 27 వ రోజుకు చేరుకుంది. సోమవారం పోలీస్‌ బలగాలు క్యాంపు కార్యాల యం వద్ద చేపడుతున్న ధర్నా వద్దకు చేరుకొని టెంట్‌ను తొలగించాల ని హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేర్చేంతవరకు ధర్నాను విరమించమని చెప్పినా భగ్నం చేయడానికి యత్నం చేశారు. భూనిర్వాసితులు పోలీసులను నిలదీయడంతో ధర్నాను భగ్నం చేయకుండా క్యాం పు కార్యాలయంలోకి వెళ్లారు.


Read more