పంటలకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-30T06:07:47+05:30 IST

వరి, పత్తి పంటలకు సస్య రక్షణ చర్యలు తీసుకో వాలని కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్‌ శాస్త్రవేత్త టి. భరత్‌ రైతులకు సూచించారు.

పంటలకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి
తాటిపాములలో పత్తి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

తిరుమలగిరి రూరల్‌/ ఆత్మకూర్‌(ఎస్‌), సెప్టెంబరు 29: వరి, పత్తి పంటలకు సస్య రక్షణ చర్యలు తీసుకో వాలని కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్‌ శాస్త్రవేత్త టి. భరత్‌ రైతులకు సూచించారు. మండలంలోని తాటిపాముల గ్రామంలో వ్యవసా యశాఖ ఆధ్వర్యంలో పత్తి, వరి పంటలపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. పత్తిగూడ దశలో ఉన్నందున సూక్ష్మ పోషకాలు ఉన్న అగ్రోమిన్‌మాక్స్‌, మల్టికే కలిపి పిచికారీ చేస్తే పత్తి ఎదుగుదల ఉండి దిగుబడి పెరుగుతుందన్నారు. వరి పంటలో సుడి దోమ ఉన్నట్లు గమనిస్తే నివారణకు తొలి దశలో ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎర్ర శోభశ్రీనివాస్‌, ఏవో వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ ప్రవీణ్‌, ఉప సర్పంచ్‌ మల్లయ్య, ఏఈవో వెంకట్‌రెడ్డి, ఉపేందర్‌, అంజయ్య, సోమయ్య పాల్గొన్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని ఏనుబాముల గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధిక సాంద్రత కలిగిన పత్తి పంటపై కృషి విజ్ఞాన కేంద్రం(కంపసాగర్‌) శాస్త్రవేత్త భరత్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి దివ్య, ఏఈవో శైలజ, గన్న శ్రీను, పాష, తిరుపతయ్య, ఉప్పలచారి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T06:07:47+05:30 IST