శ్రీవల్లి టౌనషి్‌ప ఓపెన ప్లాట్లు, గృహాల భౌతిక వేలం
ABN , First Publish Date - 2022-10-12T06:39:17+05:30 IST
నార్కట్‌పల్లి మండలం యల్లారెడ్డిగూడెం గ్రామం లో రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌనషి్‌ప ఓపెన ప్లాట్లు, గృహాలు నవంబరు 14న భౌతిక వేలం నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ
నల్లగొండ, అక్టోబరు 11: నార్కట్‌పల్లి మండలం యల్లారెడ్డిగూడెం గ్రామం లో రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌనషి్‌ప ఓపెన ప్లాట్లు, గృహాలు నవంబరు 14న భౌతిక వేలం నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. నేటి ప్లాట్లు, సెమీ పినిష్డ్ గృహాలకు కలెక్టర్ కార్యాల యం ఉదయాది త్య భవనంలో భౌతిక వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓపెన ప్లా ట్లు 229, పాక్షిక నిర్మాణ గృహాలు 355 భౌతిక వేలం నిర్వహించనున్నట్లు తెలిపా రు. ఓపెన ప్లాట్లకు చదరపు గజానికి రూ.6 వేలు పాక్షిక ని ర్మాణమైన గృహాల కు నిర్మాణ దశల అనుసరించి చదరపు గజంకు రూ.6 నుంచి రూ.10,500 అప్‌సెట్ ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ వేలంలో పాల్గొనేవారు రూ.10వేలు ఈఎండీ కలెక్టర్ పేరున చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలిపారు. వివరాలకు ప్రాజెక్టు మేనేజర్ సయ్యద్ షఫీని 9154339209 సంప్రదిం చాలని కోరారు.