ఎనిమిదేళ్ల అభివృద్ధిని ప్రజలు గుర్తించాలి

ABN , First Publish Date - 2022-10-07T05:52:26+05:30 IST

ఎనిమిదేళ్లుగా సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కోరారు.

ఎనిమిదేళ్ల అభివృద్ధిని ప్రజలు గుర్తించాలి
జిల్లాకేంద్రంలో జరిగిన విజయదశమి వేడుకల్లో మాట్లాడుతున్న మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

 విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి 

సూర్యాపేట కల్చరల్‌, అక్టోబరు 6:  ఎనిమిదేళ్లుగా సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కోరారు. విజయదశమి సందర్భంగా జిల్లాకేంద్రంలోని జమ్మిగడ్డలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన శమీపూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. యావత్‌ దేశం ఆశ్చర్యపోయేలా సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అవి ప్రజలకు చేరేలా కృషి చేశారన్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ పార్టీ లేదని, అందుకే బీఆర్‌ఎస్‌ స్థాపించారని, ఇది దేశ ప్రజలకు శుభసూచకమన్నారు. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగ అందరికీ శుభాలు ప్రసాదించాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ మాట్లాడుతూ ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రజలు ఏరకంగా సుఖసంతోషాలతో ఉన్నారో.. అ ధేవిధంగా దేశ ప్రజలు ఉండాలనే బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేశారన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి హయాంలో సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేయడంతో పాటు విద్యా, వైద్య రంగంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు గుర్తించాలన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ గుజ్జదీపికయుగేందర్‌, ఎస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు గుంటకండ్ల సునీత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాఆనంద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, వై. వెంకటేశ్వర్లు, జీడిబిక్షం, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, కౌన్సిలర్లు గండూరి పావనికృపాకర్‌, చింతలపాటి భరత్‌, సుంకరి అరుణరమేష్‌, నాయకులు సవరాల సత్యనారాయణ, మొరిశెట్టి శ్రీనివాస్‌, ఆకుల లవకుశ, కుంభం రాజేందర్‌, మున్సిపల్‌ సిబ్బంది ఎండీ గౌసోద్దీన్‌, ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-07T05:52:26+05:30 IST