అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం

ABN , First Publish Date - 2022-09-26T07:07:09+05:30 IST

Pensions will be provided to all eligible

అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం
అనంతగిరిలో కోలాటం ఆడుతున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

అనంతగిరి, సెప్టెంబరు 25: అర్హులందరికీ పింఛన్లు అంది స్తామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని  ఖానాపురం, అనంతగిరి గ్రామాల్లో ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులు,  బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. బతుకమ్మ పండుగలో ఎమ్మెల్యే పాల్గొని కోలాటం వేశారు. అదే విధంగా వెంకట్రాంపురం ఆసరా  పింఛన్ల గుర్తింపు కార్డులు, పింఛ న్లను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుర్రా సుధారాణిపుల్లారెడ్డి  పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బుర్రా సుధా రాణిపుల్లారెడ్డి, ఎంపీపీ వెంకటేశ్వర్లు, గింజుపల్లి రమేష్‌ 

 అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరికలు 

 ప్రభుత్వం చేసే అభివృద్ధికి ఆకర్షితులై పలువురు టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ అన్నారు.మండలంలోని ఖానాపురం గ్రామంలో  పలువురు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 సామాజిక సేవలో పబ్లిక్‌ క్లబ్‌ ముందుండాలి

కోదాడ టౌన్‌: సామాజిక సేవలో పబ్లిక్‌ క్లబ్‌ ముందుండాలని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం కోదాడలోని పబ్లిక్‌ క్లబ్‌ ఆడిటోరియంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లబ్‌ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తామ న్నారు. అనంతరం క్లబ్‌ పాలకవర్గం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను  సన్మా నించారు. కార్యక్రమంలో పబ్లిక్‌ క్లబ్‌ అధ్యక్షుడు నాగార్జున, వల్లూరి రామిరెడ్డి, చింతలపాటి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. 

యువత క్రీడల్లో రాణించాలి

నడిగూడెం: యువత క్రీడల్లో  రాణించాలని  ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ అన్నారు. నడిగూడెం క్రికెట్‌ లీగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వా హకుడు బానాల సతీష్‌, ఎంపీపీ యాతాకుల జ్యోతిమధుబాబు, జడ్పీటీసీ బానాల కవితనాగరాజు, సర్పంచ్‌ గడ్డం నాగలక్షి మల్లేష్‌ యాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పుట్టరమేష్‌, సురేష్‌ప్రసాద్‌, ఎస్‌డీ కలీల్‌ అహ్మద్‌,ఆంజనేయులు, బడేటి చంద్రయ్య,  శీలం గోపి పాల్గొన్నారు.

Read more