వచ్చే నెలలో అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు

ABN , First Publish Date - 2022-08-04T05:51:53+05:30 IST

వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం అర్హులం దరికీ కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు.

వచ్చే నెలలో అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

శాలిగౌరారం, ఆగస్టు 3: వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం అర్హులం దరికీ కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తక్కెళ్లపహాడ్‌ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేసి మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. అనంతరం పలువురికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులు అందజేశారు. శాలిగౌరారం, ఇటుకలపహాడ్‌, తక్కెళ్లపహాడ్‌ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు సుమారు 100 మందికి పైగా ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జెడ్పీటీసీ ఎర్ర రణీల, సింగిల్‌విండో చైర్మన్‌ తాళ్లూరి మురళి, ఐతగోని వెంకన్న, చాడ హతీష్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కట్ట లక్ష్మివెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ శేఖర్‌బాబు, సర్పంచ్‌ వేల్పుల స్వప్ననరేందర్‌, ఉపసర్పంచ్‌దొడ్డి వెంకన్న, ఎంపీటీసీ కొత్త శంకర్‌రెడ్డి, మా మిడి సర్వయ్య, గంట శంకర్‌, గుండా శ్రీనివాస్‌, చంద్రమౌళి ఉన్నారు.

Updated Date - 2022-08-04T05:51:53+05:30 IST