ఏప్రిల్ నుంచి అర్హులందరికీ పింఛన్లు: ప్రభుత్వ విప్
ABN , First Publish Date - 2022-03-05T06:18:56+05:30 IST
అర్హులైన లబ్ధిదారులందరికీ ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి తెలిపారు.
తుర్కపల్లి, మార్చి 4: అర్హులైన లబ్ధిదారులందరికీ ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వేలుపల్లి, దత్తాయపల్లి, వెంకటాపూర్, తుర్కపల్లి, మల్కాపూర్, బద్ధుతండ, బీల్యానాయక్ తండ, దయ్యంబండ తండ, ముల్కలపల్లి, జేతురాం తండ, రామపురం గ్రామాలకు 25లక్షల రూపాయల చొప్పున మంజూరైనా ఎస్‌డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురికి కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి దళిత బంధు పథకం కింది వంద యూనిట్లు మంజూరయ్యాయని, రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి, బొమ్మలరామారం మండలం మునీరాబాద్, ఆత్మకూర్(ఎం) మండలం మొర్పిరాల గ్రామాలను ఎంపిక చేసి, ప్రతి దళిత కుటుంబానికి 10లక్షల సాయం అందే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మార్చి బడ్జెట్ తర్వాత ప్రతి నియోజక వర్గానికి దళిత బంధు పథకం కింద రెండు వేల నుంచి మూడు వేల యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ కొత్త పింఛన్లు, ఇళ్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ధానావతు బీకునాయక; ఎంపీపీ భూక్య సుశీలరవీందర్‌నాయక్, వైస్ ఎంపీపీ యం శ్రీనివాస్, పీఏసీఏస్ చైర్మన్ నర్సింహరెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు కే నర్సింహులు, ఎంపీటీసీలు గిద్ధె కరుణాకర్, పలుగుల నవీన్‌కుమార్, బోరెడ్డి వనజ, సర్పంచ్‌లు వాణీశ్రీఅమరసింహరెడ్డి, వి రాంమోహన్‌శర్మ, కల్లూరి ప్రభాకర్‌రెడ్డి, పడాల వనీతశ్రీనివా్‌సపటేల్, మేకల అమలబాలకృష్ణ, గుగులోత్ సురేశ్‌నాయక్, గుగులోతు జ్యోతిభాస్కర్‌నాయక్, ఇమ్మడి మల్లప్ప, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిన్నెపురెడ్డి నరేందర్‌రెడ్డి, మండల సర్పంచ్‌లు అధ్యక్షుపాధ్యాక్షులు పోగుల ఆంజనేయులు, నాంసాని సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.