ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : మంత్రి

ABN , First Publish Date - 2022-10-07T05:47:51+05:30 IST

ఆధ్యాత్మికతకు జిల్లా పెట్టింది పేరుగా నిలిచిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : మంత్రి
ఆంజనేయస్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట కల్చరల్‌, అక్టోబరు 6: ఆధ్యాత్మికతకు జిల్లా పెట్టింది పేరుగా నిలిచిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో కార్యసిద్ది సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆథ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు భక్తిబావాన్ని పెంపొందించుకోవాలన్నారు. అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టామహోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని జలబిందెలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోర్‌, నాయకులు వై. వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్‌, కౌన్సిలర్‌ బత్తుల లక్ష్మి, పుల్లయ్య, కార్తీక్‌, బండారు లక్ష్మయ్య, బత్తుల జాని, సింహాద్రి, శేఖర్‌రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read more