ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ABN , First Publish Date - 2022-10-07T05:47:28+05:30 IST

ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి 

కనగల్‌, అక్టోబరు 6: ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవచింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో చైర్మన నల్లబోతు యాదగిరి ఆర్థికసాయంతో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అదేవిదంగా ఎన్నికల ముందు జీఎడవల్లి గ్రామస్థులకు ఇచ్చిన హామీ మేరకు ఆగ్రామంలో సుమారు రూ.60 లక్షల సొంత నిధులతో నిర్మించే రామాలయ పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు. నేటి యాంత్రిక జీవనంలో ఎదురయ్యే ఒత్తిడి, పలు రకాల సమస్యలన్నింటినీ దైవచింతనతో దూరం చేసుకోవచ్చన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కరీంపాష, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు  ఐతగోని యాదయ్యగౌడ్‌, సింగిల్‌విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివా స్‌, ఎల్లమ్మ ఆలయ చైర్మన నల్లబోతు యాదగిరి, సర్పంచులు పూలమ్మ, అంజ మ్మ, యాదమ్మ, ఎంపీటీసీలు పద్మ, శైలజ, మత్స్యసొసైటీ చైర్మన భార్గవ్‌ నాయకులు గోపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటాచారి, భూపతి, శివప్రసాద్‌, అంజయ్య పాల్గొన్నారు. 




Updated Date - 2022-10-07T05:47:28+05:30 IST