పెంపుడు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

ABN , First Publish Date - 2022-07-07T05:31:23+05:30 IST

పెంపుడు జంతువుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివా్‌సరావు అన్నారు.

పెంపుడు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసరావు

సూర్యాపేట సిటీ, జూలై 6 : పెంపుడు జంతువుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివా్‌సరావు అన్నారు. ప్రపంచ జునోసిస్‌ దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట ప్రాంతీయ సహాయ సంచాలకుడి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేబీస్‌ వ్యాధికి ఉచితంగా ప్రభుత్వం టీకాలను పంపిణీ చేస్తుందన్నారు. పెంపుడు జంతువులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ, వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, సహాయ సంచాలకుడు డాక్టర్‌ పి.జానయ్య, కౌన్సిలర్‌ యాదగిరి, పశువైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more