ఓర్వలేకనే ప్రతిపక్షాల దుష్ప్రచారం : ఎమ్మెల్సీ గుత్తా

ABN , First Publish Date - 2022-03-05T06:29:13+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రా ష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతుంటే చూసి ఓర్వలేక కాం గ్రెస్‌, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్సీ గుత్తా సు ఖేందర్‌రెడ్డి అన్నారు.

ఓర్వలేకనే ప్రతిపక్షాల దుష్ప్రచారం : ఎమ్మెల్సీ గుత్తా
దేవరకొండలో విలేకరులతో మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి

దేవరకొండ, మార్చి 4: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రా ష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతుంటే చూసి ఓర్వలేక కాం గ్రెస్‌, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని  ఎమ్మెల్సీ గుత్తా సు ఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ మునిసిపల్‌ చైర్మన న ర్సింహ గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌పై ఇటీవల జరిగిన హత్యా కు ట్రలను ఆయన తీవ్రంగా ఖండించారు. జాతీయ పార్టీలైన కాంగ్రె స్‌, బీజేపీలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యతాయుతం గా వ్యవహరించకపోతే అనేక అనుమానాలు, అపోహలు కలుగుతాయన్నారు. తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి  దో షులను పట్టుకుంటారని పేర్కొన్నారు. రేవంతరెడ్డి, బండి సంజయ్‌, డీకే అరుణలు చేసే కామెంట్లను చూస్తుంటే దొంగనే దొంగ అంటూ అనుకున్నట్లు ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి పనులను చూసి ఓట్లు అడుగుతుందని, దౌర్జన్యాలు చేసి ఎన్నడూ అడగలేదన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హ యాంలో ఎవరిపైన అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టలేదన్నారు. సమావేశంలో దేవరకొండ మునిసిపల్‌ చైర్మన ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు జానయాదవ్‌, ప్రతా్‌పరెడ్డి, వడ్త్య దేవేందర్‌నాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:29:13+05:30 IST