అవకాశవాద రాజకీయాలను తిప్పి కొట్టాలి

ABN , First Publish Date - 2022-09-13T05:30:00+05:30 IST

అవకాశవాద రాజకీయాలను ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ పిలుపునిచ్చారు.

అవకాశవాద రాజకీయాలను తిప్పి కొట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీఆర్‌సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

సంస్థాన నారాయణపురం, సెప్టెంబరు 13: అవకాశవాద రాజకీయాలను ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ పిలుపునిచ్చారు. మండలంలోని చిమిర్యాల గ్రామంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనవసరంగా మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మునుగోడు ప్రజలు కలిసి కట్టుగా సెక్యులరిజాన్ని బలపరుస్తూ మత సామర్యంతో జీవిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రజల మధ్య మతోన్మాద రాజకీయాలు చేస్తూ ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. సమావేశానికి ముందు మల్లెపల్లి కాంతమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళి ఆర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంటోజు శ్రీనివాసాచారి, డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం, చింతకాయల నర్సింహ, తుమ్మల నర్సిరెడ్డి, దోంతగోని పెద్దులు, రాములు, జంగయ్య పాల్గొన్నారు. Read more