కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ABN , First Publish Date - 2022-10-17T06:12:14+05:30 IST
జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆదివారం కొనసాగింది.రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాలనుంచి అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు.
సూర్యాపేటఅర్బన్, అక్టోబరు 16: జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆదివారం కొనసాగింది.రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాలనుంచి అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. ర్యాలీ రెండో రోజు సిరిసిల్ల, హన్మకొండ, మహబూబాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాల నుంచి మొత్తం 5వేల మంది పాల్గొన్నారు. శనివారం వర్షం ఆటంకం ఏర్పడగా, రెండో రోజు వర్షంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగింది. అభ్యర్థులకు రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, షాట్ఫుట్ను మైదానంలో నిర్వహించారు.