‘నార్మూల్‌’ను లాభాల బాటలో నడపాలి

ABN , First Publish Date - 2022-10-11T06:40:39+05:30 IST

డైరెక్టర్లు, ఉద్యోగుల సహకారాలు తీసుకొని నార్మూల్‌ డెయిరీని లాభాలబాటలో నడిపించేందుకు నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ శ్రీకర్‌రెడ్డి కృషి చేయా లని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కోరారు.

‘నార్మూల్‌’ను లాభాల బాటలో నడపాలి
ఆలేరులో పాడి రైతుల కృతజ్ఞతా సభలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత

ఆలేరు, అక్టోబరు 10: డైరెక్టర్లు, ఉద్యోగుల సహకారాలు తీసుకొని నార్మూల్‌ డెయిరీని లాభాలబాటలో నడిపించేందుకు నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ శ్రీకర్‌రెడ్డి కృషి చేయా లని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కోరారు. ఆలేరులో సోమవారం నిర్వహించిన పాడి రైతుల కృతజ్ఞతా సభలో వారు మాట్లాడారు. డెయిరీలో జరుగుతున్న పొరపాట్లను ముందుగా సవరించడంతో పాటు అదనపుఖర్చులను తగ్గించుకోవాల ని, అప్పుడే రెండేళ్లలో డెయిరీ లాభాలు సాధిస్తుందన్నారు. ఇందుకోసం కొంతత్యాగం అవసరమనే విషయాన్ని డైరెక్ట ర్లు, ఉద్యోగులు గ్రహించాలని హితవు పలికారు. నార్మూల్‌ కు అత్యధికంగా పాలు సరఫరా చేస్తున్న ఆలేరు ప్రాంతాని కి చెందిన లింగాల శ్రీకర్‌రెడ్డికి చైర్మన్‌ పదవి వరించడం అదృష్టమని, సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ఆయన కు ఆ పదవి చేకూరిందన్నారు. డెయిరీ అభివృద్ధికి ప్రభు త్వం నుంచి కావాల్సిన సహకారాలు అందించేందుకు తా ము కృషి చేస్తామన్నారు. శ్రీకర్‌రెడ్డి నియామకానికి కారణమైన సీఎం, మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, నార్మూల్‌ డెయిరీ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ పరిధిలోని పాల సొసైటీల బాధ్యులు శ్రీకర్‌రెడ్డిని ఎమ్మెల్యే సునీత, డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డిలను సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆల్డా చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌రాంరెడ్డి, మల్లేశం, డైరెక్టర్లు మందాడి ప్రభాకర్‌రెడ్డి, కె పాండరి, రాంరెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, అర్కాల గాలిరెడ్డి, చింతల పూడి వెంకట్‌రాంరెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, జలేందర్‌రెడ్డి, పి వెంకట్‌రాంరెడ్డి, కె జయశ్రీ, అలివేలు, అశోక్‌కుమార్‌, అజయ్‌కుమార్‌, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, ఎంపీపీ పల్లారెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ తోటకూర అనురాధ, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్‌, పుట్ట మల్లేష్‌, తదితరులు నాయకుల పాశికంటి శ్రీనివాస్‌, వెంకటేష్‌, సంతోష్‌, రైతు సమన్వయ సమితి మండలాల కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-11T06:40:39+05:30 IST