ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి : జడ్పీ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-09-30T06:59:21+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు.

ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి : జడ్పీ చైర్మన్‌
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 29: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు. జడ్పీలో గురువారం నిర్వహించిన నాలుగో స్థాయి సంఘం(విద్య, వైద్య) సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలు అందేలా చూడాలన్నారు. రామన్నపేట సీహెచ్‌సీలో పనిచేస్తున్న ముగ్గురు పిల్లల వైద్యులు, చౌటుప్పల్‌లో ఇద్దరు గైనకాలజిస్టులను వేరే విభాగాల్లో సర్దుబాటుచేయాలని డీసీహెచ్‌ఎ్‌సకు సూచించారు. గత సమావేశం నిర్వహించి రెండు నెలలు అయినా వైద్యుల సర్దుబాటు, సలహా సంఘం సమావేశం ఎందుకు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో వైద్యుల పనితీరు మెరుగు పరచడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులను డిప్యుటేషన్‌పై పంపితే సెలవు పెడుతున్నారని, హెచ్చరిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని డీసీహెచ్‌ఎ్‌స సమావేశం దృష్టికి తెచ్చారు. జిల్లాలో 33మంది వైద్యులు పనిచేయాల్సి ఉండగా, కేవలం 13మందే ఉన్నారని, జాతీయ హెల్త్‌ మిషన్‌ కింద (ఎన్‌హెచ్‌ఎం) కింద వైద్యులను ఇతర సిబ్బందితో భర్తీ చేసేలా ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు విన్నవిస్తామని, ఖాళీల పూర్తి వివరాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ డాక్టర్‌ కుడుదుల నగేశ్‌ కోరారు. మధ్యాహ్న భోజన పథకంపై ఫిర్యాదులు అందుతున్నాయని, విద్యార్థులకు పౌష్ఠికాహారం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. ‘మన ఊరు, మన బడి’ పథకం కింద రూ.5కోట్ల వ్యయంతో 219 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నిర్మాణ పనులు చేపడుతున్నామని డీఈవో నారాయణ రెడ్డి వివరించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో బి.శ్రీనివా్‌సరావు, సభ్యులు శ్రీరాముల జ్యోతి, ఖలీల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మల్లికార్జున్‌రావు, పీసీబీ ఏఈ సాజన, వయోజన విద్య ఏపీవో మమత, జడ్పీ సూపరింటెండెంట్‌ రమే్‌షరెడ్డి, పాల్గొన్నారు.

Read more