నామమాత్రపు సమావేశాలు

ABN , First Publish Date - 2022-03-04T06:30:46+05:30 IST

నిధుల లేమితో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటుండటంతో జడ్పీ సమావేశాలు నామమాత్రంగా సాగుతున్నాయి. సభ్యులు ఏమాత్రం ఉత్సాహం లేకుండా మొక్కుబడిగా వచ్చి తమ ప్రాంత సమస్యలను చెప్పాలా వద్దా అన్నట్లు సమావేశం దృష్టికి తీసుకుస్తున్నారు.

నామమాత్రపు సమావేశాలు

ఉత్సవ విగ్రహాలుగా జడ్పీటీసీలు, ఎంపీపీలు

నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

నల్లగొండ, మార్చి 3 : నిధుల లేమితో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటుండటంతో జడ్పీ సమావేశాలు నామమాత్రంగా సాగుతున్నాయి. సభ్యులు ఏమాత్రం ఉత్సాహం లేకుండా మొక్కుబడిగా వచ్చి తమ ప్రాంత సమస్యలను చెప్పాలా వద్దా అన్నట్లు సమావేశం దృష్టికి తీసుకుస్తున్నారు. పరిష్కారం కాకుంటే మరోసారి సమావేశంలో సభ దృష్టికి తీసుకుస్తున్నారు. అయినప్పటికీ పరిష్కారం దొరకడం లేదు. దీంతో ఏదో వచ్చాం అన్నట్లుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి వచ్చిపోతున్నారు. ఇది గత 8 ఏళ్లుగా జరుగుతున్న తంతు. ఈ క్రమంలో జిల్లా జడ్పీ సమావేశం శుక్రవారం మరోమారు నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల కేటాయింపులు పూర్తిగా నిలిచిపోవడంతో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు నిధులు రాక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. సమావేశానికి హాజరు కావడం వల్ల ఉపయోగం లేని పరిస్థితి ఉంది. సభ్యులు నిబంధనల మేరకు హాజరవుతున్నట్లు తెలిపారు. తాము ప్రజలకు జవాబుదారితనంగా ఉండలేకపోతున్నామని సభ్యులు వాపోతున్నారు. ఇక తీర్మానాలు చేసినా ఉపయోగం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కేటాయించిన 15వ ఫైనాన్స్‌ నిధులు రూ.7.6 కోట్లు మార్గదర్శకాలు రాకపోవడంతో ఇప్పటికీ విడుదల కాలేదు.

Read more