కూసుకుంట్ల విజయాన్ని ఏ శక్తీ ఆపలేదు

ABN , First Publish Date - 2022-10-17T06:06:05+05:30 IST

వామపక్షాలు బలపరిచిన ము నుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

కూసుకుంట్ల విజయాన్ని ఏ శక్తీ ఆపలేదు
చౌటుప్పల్‌ ఆరెగూడెంలో బతుకమ్మ ఆడుతున్న మంత్రి మల్లారెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌/ సంస్థాన్‌ నారాయణపురం/ చౌటుప్పల్‌ రూరల్‌/ భువనగిరి రూరల్‌, అక్టోబరు 16: వామపక్షాలు బలపరిచిన ము నుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.  చౌ టుప్పల్‌ మునిసిపాలిటీలోని తాళ్లసింగారంలో ఆదివారం రాత్రి మం త్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మునుగోడు లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పల్లె రవికుమార్‌, కౌన్సిలర్‌ బత్తుల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో పలువురు యువ కులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని పల్లగట్టుతండా, కడప గండి తండా, వాయిలపల్లి,  ఆరెగూడెం,  జనగాం,  పుట్టపాక  గ్రామా ల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌, సీపీఎం రాష్ట్ర నాయకురాలు మల్లు లక్ష్మి, ఎంపీపీ ఉమాదేవి, జడ్పీటీసి భానుమతి, సర్పంచ్‌ సామ ల భాస్కర్‌, ఎంపీటీసీలు మర్రి వసంత, గాలయ్య, ఆడెపు పరదేశి,  దేప విప్లవరెడ్డి,  దొంతగాని పెద్దలు, పాల్గొన్నారు. గొర్రెల పెంపకం యూనిట్‌ దారుల బ్యాంకు ఖాతాలపై ప్రీజింగ్‌ ఎత్తి వేస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌, హరీష్‌రావుల హామీపై చౌటుప్పల్‌ మండల ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో గొర్రెలపెంపకందారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వ హించిన ర్యాలీలో 30మంది మరుగుజ్జు కళాకారుల ప్రదర్శన అకట్టుకుంది. మంత్రి మల్లారెడ్డి ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గ్రామ కూడలిలో మంత్రి మల్లారెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ అట అడి ఉత్సహపరిచారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మునగాల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు జాల మల్లేష్‌యాదవ్‌, చినల నర్సింహ, కొత్త రాజు, గంగనబోయిన హనుమయ్య, రమేష్‌,  దుర్గం రాజు, చిన్నం శ్రీశైౖలం పాల్గొన్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మాట్లాడారు. ఓట్లేసిన ప్రజలను మోసం చేసి రూ.22వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడు పోయిన వ్యక్తి రాజగోపాల్‌రెడ్డి అని ఆరోపించారు. సంస్థాన్‌నారాయణపురంలో జరిగిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడారు. చౌటుప్పల్‌ మండలం పీపల్‌ పహాడ్‌లో నర్సాపురం ఎమ్మెల్యే చిరుమల మధన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలిస్తేనే మునుగోడు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఽమధన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. చౌటుప్పల్‌ మండలం కైతాపురంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అనిల్‌, రామలింగంరెడ్డి, కవిత, దర్శన్‌, నగేశ్‌, వెంకటేశ్‌, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. చౌటుప్పల్‌లోని 12వ వార్డులో మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్‌. భాస్కర్‌రావు, చేనేత అభివృద్ధి మండలి చైర్మన్‌ చింతా ప్రభాకర్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ముని సపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఏఎంసీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌ రెడ్డి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు మల్లు లక్ష్మి, కౌన్సిలర్‌ తాడూరి శిరీషా పరమేష్‌ పాల్గొన్నారు. 13వ వార్డులో పటన్‌ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. 

Updated Date - 2022-10-17T06:06:05+05:30 IST