పెదనెమిలను సందర్శించిన నెదర్లాండ్ దేశస్థులు
ABN , First Publish Date - 2022-08-12T07:10:02+05:30 IST
మండలంలోని పెదనెమిల గ్రామాన్ని నెదర్లాండ్ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎంవీఎఫ్ చేపడుతున్న బాలిక సాధికారిత, లింగ వివక్షత నిర్మూలన కార్యక్రమాలను నెదర్లాండ్ దేశస్థులు లిండా, ఆల్కో గ్రామ సర్పంచ్‌ని మరాఠి రామస్వామిని అడిగి తెలుసుకున్నారు.
నూతన్‌కల్ ఆగస్టు 11: మండలంలోని పెదనెమిల గ్రామాన్ని నెదర్లాండ్ బృందం సభ్యులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎంవీఎఫ్ చేపడుతున్న బాలిక సాధికారిత, లింగ వివక్షత నిర్మూలన కార్యక్రమాలను నెదర్లాండ్ దేశస్థులు లిండా, ఆల్కో గ్రామ సర్పంచ్‌ని మరాఠి రామస్వామిని అడిగి తెలుసుకున్నారు. బాల్య వివా హాలను అరికట్టడానికి గ్రామపంచాయతీ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ భాస్కర్, ఇన్చార్జి హెచ్ఎం హరికృష్ణ, రవి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.