నాణ్యత లేకుండా జాతీయ రహదారి పనులు

ABN , First Publish Date - 2022-07-07T06:26:25+05:30 IST

నేరేడుచర్ల పట్టణంలో నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల్లో నాణ్యతలేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పారేపల్లి శేఖర్‌రావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పాల్వాయి రమేష్‌ ఆరోపించారు.

నాణ్యత లేకుండా జాతీయ రహదారి పనులు
నేరేడుచర్లలో విలేకరులతో మాట్లాడుతున్న పారేపల్లి శేఖర్‌రావు

నేరేడుచర్ల, జూలై 6: నేరేడుచర్ల పట్టణంలో నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల్లో నాణ్యతలేదని  సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పారేపల్లి శేఖర్‌రావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పాల్వాయి రమేష్‌ ఆరోపించారు. బుధవారం నేరేడుచర్లలో జరుగుతున్న జాతీయ రహదారి పను లను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో చోట ఒక్కో కొలతలతో నిబంధనలకు విరుద్ధంగా రహదారికి ఇరువైపులా డ్రైన్లు నిర్మిస్తున్నారన్నారు. రోడ్డు మధ్య వ్యత్యాసాలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.  జాతీయరహదారి అధికారులు స్పందించి వాటిని సరిచేయాలని కోరారు. పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ కాల్వను మురుగు కాల్వగా మారుస్తున్నారని ఆరోపించారు. పంట కాల్వలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఎం పట్టణ  కార్యదర్శి కొదమగుండ్ల నగేష్‌, రాంమ్మూర్తి, సామాజిక కార్యకర్త బెల్లంకొండ శేఖర్‌, టీడీపీ నాయకులు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-07T06:26:25+05:30 IST