దేశభక్తిని నింపేందుకే నిత్య జాతీయ గీతాలాపన : ఎంపీపీ

ABN , First Publish Date - 2022-08-16T06:58:27+05:30 IST

ప్రతీ పౌరునిలో దేశభక్తి ని మరింత పెంచేందుకు నార్కట్‌పల్లిలో నిత్య జాతీ య గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ నరేందర్‌రెడ్డి అన్నారు.

దేశభక్తిని నింపేందుకే నిత్య జాతీయ గీతాలాపన : ఎంపీపీ
నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ నరేందరెడ్డి

నార్కట్‌పల్లి, ఆగస్టు 15: ప్రతీ పౌరునిలో దేశభక్తి ని మరింత పెంచేందుకు నార్కట్‌పల్లిలో నిత్య జాతీ య గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ నరేందర్‌రెడ్డి అన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని సుమారు రూ.లక్ష వ్య యంతో నార్కట్‌పల్లి పట్టణంలోని 12 కూడళ్లలో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా నిత్య జాతీయ గీతాలాపనను ఆయన సోమవారం ప్రారంభించారు. ప్రతీ రోజు నిర్ణీత సమయంలో జాతీయ గీతాలాపన జరుగుతుందని, ఆ సమయంలో ప్రతీ ఒక్కరూ విధిగా జాతీయ గీతం పూర్తయ్యేంత వరకు వేచి ఉండి జాతీయ గీతాన్ని గౌరవించాలని ఎంపీపీ కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బి.రామకృష్ణ, సర్పంచ దూదిమెట్ల స్రవం తి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, దుబ్బాక పావని శ్రీధర్‌, పాశం శ్రీనివా్‌సరెడ్డి, ఉపసర్పంచ సిర్పంగి స్వామి, వివిధ పార్టీల నాయకులు అయితరాజు యాదయ్య, దోసపాటి విష్ణు, వార్డుసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T06:58:27+05:30 IST