అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్‌ను అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2022-12-31T00:25:39+05:30 IST

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరు నరే్‌షను అరెస్టు చేయాలని అయ్యప్పమాలధారులు కోదాడలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్‌ను అరెస్టు చేయాలి
కోదాడలో రాస్తారోకో చేస్తున్న అయ్యప్పమాలధారులు

కోదాడ టౌన / నేరేడుచర్ల, డిసెంబరు 30 : వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరు నరే్‌షను అరెస్టు చేయాలని అయ్యప్పమాలధారులు కోదాడలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. నరే్‌షపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక మ్రంలో గురుస్వామి ఓరుగంటి వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, శ్రీనివాసరావు, మాలధారులు పాల్గొన్నారు. అదేవిధంగా నేరేడుచర్లలో బైరు నరే్‌షను అరెస్టుచేయాలని అయ్యప్పమాలధారులు పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఐల శ్రీనివాస్‌, చిట్యాల శ్రీను, యారవ సురేష్‌, డీవీ రమణారెడ్డి, పురుషోత్తంరెడ్డి, గుర్వయ్య, కిషోర్‌, గజ్జల లక్ష్మణ్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:25:40+05:30 IST