ఉత్తమ షీటీంగా నిలిచిన నల్లగొండ

ABN , First Publish Date - 2022-05-28T06:10:16+05:30 IST

రాష్ట్రంలోనే ఉత్తమ షీటీమ్‌గా నల్లగొండ బృందం ఎంపికైంది. హైదరాబాద్‌లోని భరోసా సెంటర్‌లో షీటీం బృందాలకు నిర్వహించిన సైబర్‌ సేఫ్టీ, సైబర్‌ నేరాల నియంత్రణపై నిర్వహించిన ఒక్కరోజు శిక్షణలో జిల్లా బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఉత్తమ షీటీంగా నిలిచిన నల్లగొండ
ఉత్తమ షీటీం జ్ఞాపికను అందజేస్తున్న డీఐజీ

 జ్ఞాపికను అందజేసిన డీఐజీ సుమతి 


నల్లగొండ టౌన్‌, మే 27: రాష్ట్రంలోనే ఉత్తమ షీటీమ్‌గా నల్లగొండ బృందం ఎంపికైంది. హైదరాబాద్‌లోని భరోసా సెంటర్‌లో షీటీం బృందాలకు నిర్వహించిన సైబర్‌ సేఫ్టీ, సైబర్‌ నేరాల నియంత్రణపై నిర్వహించిన ఒక్కరోజు శిక్షణలో జిల్లా బృందం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి డీఐజీ సుమతి హాజరై పలు అంశాలపై సూచనలు చేశారు. అనంతరం ఉత్తమ షీటీం బృందంగా నల్లగొండను ఎంపికచేస్తూ బృందానికి బెస్ట్‌ షీటీం జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో షీటీం ఇన్‌చార్జి సీఐ రాజశేఖర్‌గౌడ్‌, షీటీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T06:10:16+05:30 IST