ఐనటీయూసీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నాగయ్య
ABN , First Publish Date - 2022-10-17T06:37:42+05:30 IST
ఉమ్మడి తెలుగు రాష్ర్టాల ఐనటీయూసీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నూకపంగ నాగయ్య నియామకమయ్యారు.
మిర్యాలగూడ, అక్టోబరు 16: ఉమ్మడి తెలుగు రాష్ర్టాల ఐనటీయూసీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నూకపంగ నాగయ్య నియామకమయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ నుంచి నియామకపత్రాన్ని అందుకున్నారు. నాగయ్య మాడ్గులపల్లి మండలం కుక్కడం విశాఖ ఇండస్ర్టీలో ఐనటీయూసీ కార్మిక నాయకునిగా క్రియాశీలకంగా చేశారు. నల్లగొండ జిల్లా ఐనటీయూసీ వైస్ ప్రెసిడెంట్‌గా, కార్మిక యూత వింగ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని తెలిపారు.