ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్-ఏ గ్రేడ్ గుర్తింపు
ABN , First Publish Date - 2022-04-20T06:33:25+05:30 IST
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్ 3వ సైకిల్‌లో భాగంగా ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటించింది.
నల్లగొండటౌన, ఏప్రిల్ 19: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్ 3వ సైకిల్‌లో భాగంగా ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటించింది. ఈ నెల 12, 13వ తేదీల్లో ముగ్గురు సభ్యులతో కూడిన న్యాక్ బృందం కళాశాలలో పర్యటించి అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ గ్రేడ్ పొందిన కళాశాల్లో రాష్ట్రంలోనే 3వ కళాశాలగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు గుర్తింపు లభించింది. దీనిద్వారా యూజీసీ నుంచి మరిన్ని నిధులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘనశ్యామ్ మాట్లాడుతూ ఏ గ్రేడ్ సాధించడానికి కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం ఎంతో కృషి చేశారని తెలిపారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్.రాజారాం, జె.భాస్కర్‌రెడ్డి, జ్యోతి, శ్రీనివా్‌సరెడ్డి, వెంకటేశ్వర్లు, అపర్ణ చతుర్వేది, వెంకటరామారావు, దేవపాని పాల్గొన్నారు.