TS News: మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతి సెగ
ABN , First Publish Date - 2022-08-10T21:22:11+05:30 IST
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో టీఆర్ఎస్లో అసమ్మతి సెగ రగులుతోంది.

హైదరాబాద్ (Hyderabad): మునుగోడు ఉప ఎన్నిక (By-election) నేపథ్యంలో నియోజకవర్గంలో టీఆర్ఎస్ (TRS)లో అసమ్మతి సెగ రగులుతోంది. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఇంట్లో మునుగోడు నియోజక వర్గం నేతలు సమావేశమయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లతో మంత్రి భేటీ అయ్యారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదని అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. కూసుకుంట్లతో విభేదాలపై అసమ్మతి నేతలు గతంలోనే సీఎం కేసీఆర్, మంత్రులకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అసమ్మతి నేతలను మంత్రి జగదీష్ రెడ్డి బుజ్జగించే కార్యక్రమం చేపట్టారు.