నాయకుడి లేని నావలాగా కాంగ్రెస్ ఎటు కొట్టుకుపోతుందో...: Gutta

ABN , First Publish Date - 2022-03-02T15:26:52+05:30 IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

నాయకుడి లేని నావలాగా కాంగ్రెస్ ఎటు కొట్టుకుపోతుందో...: Gutta

నల్గొండ: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేని నావలాగా సాగుతోందని.. ఎప్పుడు ఎటు కొట్టుకుపోతుందో వారికే తెలియదన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరని... కాంగ్రెస్ పార్టీలో రోజూ తన్నులాటే అని... అలాంటిది 2023లో అధికారంలోకి రావడం ఖాయమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగేవాడుకుంటుందన్నారు. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-03-02T15:26:52+05:30 IST