మిర్యాలగూడకు జిల్లా ఆస్పత్రి?
ABN , First Publish Date - 2022-08-04T06:02:01+05:30 IST
మిర్యాలగూడకు జిల్లా ఆస్ప త్రి హోదా దక్కనుందా అంటే ఔననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం జరుగుతు న్న అభివృద్ధి పనులు చూస్తుంటే ఖచ్చితంగా జిల్లా ఆస్పత్రి ఇక్కడికే మారుతున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా ఆస్పత్రి కి కావాల్సిన వనరులన్నీ ఇక్కడ ఉండడం, దీనికి తోడు ఇక్కడ ఉండే ముఖ్య ప్రజాప్రతినిధి పట్టుదలతో అతను చేస్తున్న కృషివల్ల జిల్లా ఆస్పత్రి మిర్యాలగూడకే రానుంది.
త్వరలో వెలువడనున్న ప్రభుత్వ ఉత్తర్వులు
ఇప్పటికే ప్రారంభమైన పలు అభివృద్ధి పనులు
ఏరియా ఆస్పత్రిగా నకిరేకల్ సీహెచ్‌సీ
క్లస్టర్‌గా హాలియా పీహెచ్సీ
నల్లగొండ అర్బన్, ఆగస్టు 3: మిర్యాలగూడకు జిల్లా ఆస్ప త్రి హోదా దక్కనుందా అంటే ఔననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం జరుగుతు న్న అభివృద్ధి పనులు చూస్తుంటే ఖచ్చితంగా జిల్లా ఆస్పత్రి ఇక్కడికే మారుతున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా ఆస్పత్రి కి కావాల్సిన వనరులన్నీ ఇక్కడ ఉండడం, దీనికి తోడు ఇక్కడ ఉండే ముఖ్య ప్రజాప్రతినిధి పట్టుదలతో అతను చేస్తున్న కృషివల్ల జిల్లా ఆస్పత్రి మిర్యాలగూడకే రానుంది. ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కోట్ల రూ పాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు వడివడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2019లో జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరుచేయడంతో జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ కళాశాల పరిధిలోని బోధనా ఆస్పత్రిగా మారింది. దీంతో జిల్లా ఆస్పత్రి వేరే చోటుకి మార్చాల్సి వచ్చింది. మిర్యాలగూడ, దేవరకొండ ఈ రెండు జిల్లా ఆస్పత్రుల పోటీలో ఉన్నాయి. గత మూడేళ్లుగా జిల్లా ఆస్పత్రులకోసం రెండు ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఎవరికి వారే ప్రయత్నాలు సాగించారు. గానీ మిర్యాలగూ డ ఏరియా ఆస్పత్రిలో కొనసాగుతున్న పనులు చూస్తుంటే జిల్లా ఆస్పత్రి మి ర్యాలగూడకు వెళ్లనున్నట్లు స్పష్టం అవుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ 100 పడకలతో ఏరియా ఆస్పత్రి గా కొనసాగుతోంది. అభివృద్ధి పనులకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14కోట్లు మంజూరుచేసింది. మరో 150 అదనపు పడకలకు నిర్మాణం, 40పడకలతో ట్రామాకేర్ సెంటర్ పనులు కొనసాగుతున్నాయి. రూ.65లక్షలతో 30పడకల నవజాత శిశు సంరక్షణకేంద్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుం డా 50పడకలతో గర్భిణులకోసం ప్రత్యేకంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రం కూడా త్వరలోనే నిర్మించనున్నారు. రూ.84లక్షలతో అధునాతన ఎలక్ట్రికల్ పనులు, రూ.80లక్షలతో ఇంటీరియర్ డెకరేషన్, రూ.30లక్షలతో మార్చురీ షెడ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఆక్సీజన్ కొరత లేకుండా ప్లాం ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రి అందుబాటులోకి వస్తే మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజల కు అధునాతన వైద్యసేవలు అందనున్నాయి. అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. నిపుణులైన డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు.
ఏరియా ఆస్పత్రిగా నకిరేకల్ సీహెచ్‌సీ
రోగుల తాకిడి అధికంగా ఉండడం, అక్కడ ఉండే ముఖ్య ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో నకిరేకల్‌కు ఏరియా ఆస్పత్రి మంజూరైం ది. సీహెచ్‌సీగా కొనసాగుతున్న నకిరేకల్ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 30పడకలతో వైద్య సేవలందిస్తున్న ఈ ఆస్పత్రి 100పడకల ఏరియా ఆస్పత్రిగా మారింది. నకిరేకల్ బస్టాండ్ సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. ఇందుకు సంబంధించిన కాంట్రాక్టర్ టెండర్లు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. రూ.30కోట్లతో భవన నిర్మాణం, రూ.10కోట్లతో వైద్య పరికరాలు ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు నిధులు విడుదలయ్యాయి. ఏరియా ఆస్పత్రి అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా జాతీయ రహదారి ఉండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు వీలుంటుంది.
క్లస్టర్‌గా హాలియా పీహెచ్సీ..
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న హాలియా పీహెచ్‌సీని (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) క్లస్టర్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఆరు పడకలతో కొనసాగుతున్న పీహెచ్సీ 30 పడకల క్లస్టర్‌గా మారనుంది. భవన నిర్మాణం కోసం రూ.5కోట్లు, వైద్య పరికరాలు, ఇతర సామాగ్రికోసం రూ.2కోట్లు మంజూరయ్యాయి. కానీఇంకా టెండర్ల నిర్మాణం పూర్తి కాలేదు. టెండర్ల ప్రక్రియ అనంతరం నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి : డాక్టర్ మాతృనాయక్, ఏరియా ఆస్పత్రుల సమన్వయ అధికారి, నల్లగొండ
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రుల్లో ఇప్పటికే అన్ని రకాల వైద్య సేవలు రోగులకు అందుతున్నాయి. రోగుల తాకిడి కూడా అధికంగా ఉంది. జిల్లా ఆస్పత్రికి కావాల్సిన వసతులన్నీ ఉన్నాయి. జిల్లా ఆస్పత్రికి కావాల్సిన అభివృద్ధి పనులన్నీ చకచకా కొనసాగుతున్నాయి. జిల్లా ఆస్పత్రి ఇక్కడికి వస్తే పరిసర ప్రాంత ప్రజలకు ఇంకా అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
త్వరలోనే నకిరేకల్‌లో పనులు ప్రారంభిస్తాం : అజీజ్, ఈఈ
మిర్యాలగూడలో నిర్మాణ పనులన్నీ కొనసాగుతున్నాయి. నకిరేకల్ ఏరియా ఆస్పత్రిగా మార్చేందుకు టెండర్లు పూర్తయ్యాయి. త్వరలోనే నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హాలియా సీహెచ్‌సీగా మార్చేందుకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ ప్రక్రియ అనంతరరం ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.