వైద్య సేవలు మెరుగుపర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-08-04T05:53:19+05:30 IST

ప్రజలకు సకాలంలో వైద్యసేవలు అందేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి అన్నారు. పెన్‌పహాడ్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె బుధవారం ఆకస్మికంగా అన్ని విభాగాలను తనిఖీ చేశారు.

వైద్య సేవలు మెరుగుపర్చుకోవాలి
పెన్‌పహాడ్‌ పీహెచ్‌సీ తనిఖీచేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి

పెన్‌పహాడ్‌, ఆగస్టు 3 : ప్రజలకు సకాలంలో వైద్యసేవలు అందేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి అన్నారు. పెన్‌పహాడ్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె బుధవారం ఆకస్మికంగా అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగుల నుంచి ఎలాంటి ఆరోపణలు రాకుండా వైద్యం అందేలా చూడాలన్నారు. పీహెచ్‌సీలో రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదని, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండరని, సమయ పాలన పాటించరని మాజీ ఎంపీటీసీ తూముల సురే్‌షరావు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్యసిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి పద్ధతులు మార్చుకోవాలని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట జాయింట్‌ డైరెక్టర్‌ పద్మజ, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు హర్షవర్థన్‌, నిరంజన్‌, ఎల్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌ కల్యాణచక్రవర్తి, జిల్లా టీబీ అధికారి చంద్రశేఖరరాజు, ఐడీఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ నజీయా, బీబీవోలు కిరణ్‌, అరుణ, ఎంహెచ్‌వో ఏవో డాక్టర్‌ యమున, మండల వైద్యాధికారులు డాక్టర్‌ మణిదీప్‌, డాక్టర్‌ సాధిక పాల్గొన్నారు.


Updated Date - 2022-08-04T05:53:19+05:30 IST