మెడికల్‌ కళాశాల హాస్టల్‌ను మార్చాలి

ABN , First Publish Date - 2022-09-14T05:28:13+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని గర్భిణుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ని ర్వహిస్తున్న మెడికల్‌ కళాశాల హాస్టల్‌ను వేరే చోటుకు మార్చాలని కేవీపీఎస్‌, ఐద్వా పలు సం ఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

మెడికల్‌ కళాశాల హాస్టల్‌ను మార్చాలి
మెడికల్‌ కళాశాల గేటు ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

నల్లగొండ అర్బన, సెప్టెంబరు 13: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని గర్భిణుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ని ర్వహిస్తున్న మెడికల్‌ కళాశాల హాస్టల్‌ను వేరే చోటుకు మార్చాలని కేవీపీఎస్‌, ఐద్వా పలు సం ఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం కేవీపీఎస్‌, ఐద్వా పలు సంఘాల ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాల గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజకుమారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు పాలడుగు ప్రభావతి, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మా ట్లాడుతూ ఎంసీహెచ కేంద్రంలో హాస్టల్‌ నిర్వహించడం వల్ల గర్భిణీలకు సరైన వై ద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణుల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఆస్పత్రిలో హాస్టల్‌ నిర్వహించడమేంటని ప్రశ్నించారు. తక్షణమే సంబంధిత అధికారులు దృష్టి సారించి హాస్టల్‌ను వేరేచోటుకు మార్చాలని కోరారు. కార్యక్రమంలో తెవివే జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, ఎంఎస్పీ నియోజకవర్గ ఇనచార్జి శ్రీనివాస్‌, ఎం.భిక్షమయ్య, టి.పద్మ, కె.మురళి, కె.ఉమారాణి పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-14T05:28:13+05:30 IST