డిండి రిజర్వాయర్‌లో దూకి వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-31T00:33:07+05:30 IST

డిండి రిజర్వాయర్‌లో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. డిండి ఎస్‌ఐ సురేష్‌, మహిళ కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఛత్రినాకకు చెందిన మెట్టు సునీత(34) చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది.

డిండి రిజర్వాయర్‌లో దూకి వివాహిత ఆత్మహత్య

ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం

ఆపై బలవన్మరణం

డిండి, డిసెంబరు 30: డిండి రిజర్వాయర్‌లో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. డిండి ఎస్‌ఐ సురేష్‌, మహిళ కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఛత్రినాకకు చెందిన మెట్టు సునీత(34) చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరింది. డిండి చేరుకొని రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించింది. ఫోన్‌ను నీటి ఒడ్డున పెట్టి ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

మృతదేహాన్ని పోలీస్‌ సిబ్బంది రిజర్వాయర్‌లో నుంచి బయటకు తీశారు. సునీత భర్త మెట్టు శ్రీనివాస్‌ డిండి రిజర్వాయర్‌ వద్దకు చేరుకొని మృతదేహాన్ని గుర్తించాడు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని శ్రీనివాస్‌ తెలిపాడు. శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని దేవర కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కూలీ..

శాలిగౌరారం: ఆర్థిక ఇబ్బందులు తాళలేక కూలీ ఆత్మహత్య చేసుకున్నా డు. శాలిగౌరారం ఎస్‌ఐ సతీష్‌, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అడ్లూరు గ్రామానికి చెందిన కడారి మధు(30) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అతని భార్య, తండ్రి ఇటీవలనే అనారోగ్యంతో మృతిచెందారు. దీనికితోడు అప్పులు అధికం కావడం, తోడు ఎవరూ లేరనే మానసిక వేదనతో జీవితం పై విరక్తి చెంది గురువారం తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధుకు ఓ కుమార్తె ఉంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-31T00:33:07+05:30 IST

Read more