గంజాయి పట్టివేత: ఇద్దరు యువకుల అరెస్టు
ABN , First Publish Date - 2022-06-30T06:35:33+05:30 IST
మండలంలోని గుండ్లబాయి జాతీయ రహదారిపై గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

చౌటుప్పల్ రూరల్, జూన 29: మండలంలోని గుండ్లబాయి జాతీయ రహదారిపై గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబననగర్ పట్టణానికి చెందిన దూలం అరవింద్ (22) గంజాయికి అలవాటుపడి తరచూ ఒరిస్సా బార్డర్కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఒరిస్సాకు చెందిన పప్పుల తిరుపతి (19) పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి గంజాయి తాగి స్నేహితులుగా మారారు. గంజాయి వ్యాపారం చేస్తే అధికంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో గంజాయిని హైదరాబాద్కు సరఫరా చేస్తున్నారు. ఒరిస్సాకు చెందిన గంజాయి వ్యాపారి అప్పారావు దగ్గర గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్కు చెందిన కాలే సాహేబ్ అనే వ్యాపారికి విక్రయించడానికి ఈనెల 27న కారులో బయలుదేరారు. పక్కా సమాచాచం అందుకున్నా స్థానిక పోలీసులు మంగళవారం సాయంత్రం గండ్లబాయి 65వ నెంబర్ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. ఇద్దరు నిందుతుల నుంచి రూ.28వేల విలువగల 28 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, రూ.13,800 నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందుతులను చౌటుప్పల్ కోర్డులో బుధవారం హాజరుపరిచారు. మరో ఇద్దరు నిందుతులు కాలేసాహేబ్, అప్పారావును త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.