నేచురోపతి వైద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మణిరత్నం
ABN , First Publish Date - 2022-12-16T01:51:37+05:30 IST
నేచురోపతి వైద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా అర్వ పల్లి మండల కేంద్రానికి చెందిన చినపాక మణిరత్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అర్వపల్లి, డిసెంబరు 15: నేచురోపతి వైద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా అర్వ పల్లి మండల కేంద్రానికి చెందిన చినపాక మణిరత్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అర్వపల్లిలో నిర్వహించిన ఆ సంఘం సమా వేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాఽధ్యక్షుడిగా నాగా ర్జున, ప్రధాన కార్యదర్శిగా భానుతేజ, కోశాధికారిగా సింధూర, విద్యార్థుల సంఘం అఽధ్యక్షుడిగా అనుదీప్‌తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మణిరత్నం ప్రస్తుతం బాలెంల పల్లె దవా ఖానాలో వైద్య సేవలు అంది స్తున్నారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ తనును ఎన్ను కున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.